Ravi Teja | పొలిటికల్ థ్రిల్లర్ కథతో రవితేజ నెక్స్ట్ మూవీ?
Ravi Teja Next Movie | ఫలితం ఎలా ఉన్నా రవితేజ మాత్రం వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. చాలా కాలం తర్వాత ‘క్రాక్’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన మాస్రాజ.. ఈ ఏడాది ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీల’తో రెండు వరుస ఫ్లాపులను ఖాతాలో వేసుకున్నాడు. అయితే రవితేజ మాత్రం హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధంలేకుండా ఏడాదికి రెండు మూడు సినిమాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. ఈ నాలుగు సినిమా షూటింగ్‌లు ఏకకాలంలో జరుగుతున్నాయి. అయితే ఇవి సెట్స్‌పైన ఉండగానే తాజాగా ఈయన మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
‘లక్ష్యం’, ‘లౌక్యం’, ‘డిక్టేటర్’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శ్రీవాస్‌తో రవితేజ తదుపరి సినిమా చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు పూర్తయ్యాయని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కనుందట. త్వరలోనే దీనిపై అఫిషియల్‌గా అనౌన్స్మెంట్ రానున్నట్లు టాక్. ప్రస్తుతం శ్రీవాస్ గోపిచంద్‌తో మూడో చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రవితేజతో నెక్స్ట్ సినిమాను ఓకే చేయించుకున్నాడు.
‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫలితంతో రవితేజ తన తదుపరి సినిమాలపై పూర్తి దృష్టిని పెట్టాడు. ప్రస్తుతం ఈయన ‘టైగర్‌నాగేశ్వరరావు’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇండియన్ రాబిన్‌హుడ్‌గా పిలవబడే గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. దీనితో పాటుగా త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఇక సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రావణాసుర’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రంలో రవితేజ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. వీటీతో పాటుగా చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’లో కీలకపాత్రలో నటిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

