Maruthi | ప్రభాస్‌కు మారుతి పుట్టినరోజు విషెస్.. ‘రాజాసాబ్’ ఎఫెక్ట్‌తో తెగ ట్రోలింగ్
Maruthi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Maruthi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మారుతి కూడా ప్రభాస్‌ను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రభాస్‌ను తన గురువుగా, మార్గదర్శిగా అభివర్ణిస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. అయితే ఈ పోస్ట్‌పై కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇందుకు గతంలో ప్రభాస్, మారుతి కలయికలో వచ్చిన ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన చేదు అనుభవాలే కారణమని అభిమానుల మెసేజ్లని బట్టి తెలుస్తోంది.
ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మారుతి తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభాస్‌ను తన గురువుగా, ఆశయంగా అభివర్ణిస్తూ, తాను చూసిన అత్యుత్తమ వ్యక్తుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు. వెండితెరపై భారీ విజయాలు అందుకుంటున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో ఆయన చూపించే వినయం, నిరంతరం కష్టపడే తత్వం ఎంతోమందికి స్ఫూర్తినిస్తాయని ప్రశంసించారు. ప్రభాస్ జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ, ఎల్లప్పుడూ ఆయనకు అభిమానిగా అండగా ఉంటాననే భావాన్ని తన సందేశంలో వ్యక్తం చేశారు. అయితే సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌కి మిశ్రమ స్పందన లభించింది.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ సినిమాపై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా ఫలితంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్ర ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యలు, సినిమాపై పెంచిన అంచనాలను గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ కొందరు నెటిజన్లు మారుతిని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు చేసిన భావోద్వేగ పోస్ట్‌పై కూడా కొందరు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. గత సినిమా ఫలితాన్ని ప్రస్తావిస్తూ, ప్రభాస్‌తో మరోసారి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రశంసలు చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. మరికొందరు మాత్రం ఒక దర్శకుడు తన హీరోపై అభిమానంతో శుభాకాంక్షలు తెలపడంలో తప్పేముందని అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megastar Chiranjeevi | ఎవరినీ అడగలేదు.. కానీ ఆ డైరెక్టర్‌ను మాత్రం నాతో సినిమా చేయమని అడిగా: చిరంజీవి!
CM Yogi Adityanath: హ్యాట్రిక్‌తో రికార్డులు బద్దలు కొడుతాం: యూపీ సీఎం
‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా’.. పెంపుడు కుక్కకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
Tharun Bhascker | నా కొడుకుకి ఒకరున్నారనే ధైర్యం వచ్చింది.. తరుణ్-ఈషా రిలేషన్‌పై తల్లి గీతా భాస్కర్ భావోద్వేగం!
Mahabubnagar | ‘నా భార్య ఇజ్జత్ తీస్తుంది.. బతకాలని లేదు’.. తల్లిదండ్రులకు సెల్ఫీ వీడియో పంపి యువకుడు అదృశ్యం
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

