Ginna Movie | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన జిన్నా మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఏదంటే?
మంచు విష్ణు కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది.
Ginna Movie On OTT | మంచు విష్ణు కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ‘ఢీ’, ‘దూసుకెళ్తా’, ‘దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం.. కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గించారు. అయితే ఈ సారి అందరూ మెచ్చే హర్రర్ కామెడీ జోనర్లో జిన్నా సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్ వంటి బోల్డ్ బ్యూటీలో ఈ సినిమాలో నటించనుండటంతో యూత్‌లో మంచి క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా కోనవెంకట్ ఈ సినిమాకు కథ అందించడంతో ప్రేక్షకుల్లో ఓ మోస్తరు అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఆ క్రేజ్ జనాలను థియేటర్ల వరకు తీసుకురాలేకపోయింది. కానీ ఆ బజ్ జనాలను థియేటర్ల వరకు తీసుకురాలేకపోయింది. రిలీజ్ రోజు పాజిటీవ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. రిలీజైన ఫస్ట్ వీకెండ్లోనే జిన్నా దుకాణం సర్దేసింది.
అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌లో ఈ చిత్రం గత రాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కాగా గతకొంత కాలంగా థియేటర్లో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు ఓటీటీలో అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. అదే బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా మిగిలిన సినిమాలు ఓటీటీలో మంచి వ్యూవర్ షిప్‌ను సాధిస్తున్నాయి. ఈ లెక్కను చూసుకుంటే జిన్నా సినిమా కూడా ఓటీటీలో మంచి వ్యూవర్షిప్ను సాధించే చాన్స్ ఉంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అవ ఎంటర్టైనమెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

