Ginna Movie Post Poned | గతేడాది ‘మోసగాళ్ళు’ సినిమాతో భారీ ఫ్లాప్‌ను సాధించిన మంచు విష్ణు ఈ సారి ఎలాగైనా ‘జిన్నా’తో మంచి కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. ఇషాన్ సూర్య దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రం పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తుంది.
దసరా బరిలో ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’, ‘ది ఘోస్ట్’ చిత్రాలు విడుదల కానున్నట్లు అపిషియల్గా ప్రకటన వచ్చింది. ఇక ఈ రెండు చిత్రాలకు ప్రస్తుతం విపరీతమైన బజ్ ఉంది. ఈ క్రమంలో జిన్నా చిత్రాన్ని రిలీజ్ చేయడం కరెక్టు కాదని మేకర్స్ భావించారట. దాంతో జిన్నా చిత్రాన్ని రెండు వారాలు పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సమాచారం. కాగా అక్టోబర్ 21న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనున్నారట. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా సన్నిలియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించారు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అవ ఎంటర్టైనమెంట్స్ సంస్థ నిర్మిస్తుంది.