Manchu Vishnu | విష్ణు ‘జిన్నా’ ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్
Manchu Vishnu First Look | హిట్లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు మంచు విష్ణు. ఈయన కెరీర్ మొదట్లో మంచి స్పీడ్‌లో ఉండేది. ఢీ, దూసుకెళ్తా, దేనికైనారెడి వంటి సినిమాలు విష్ణుకు కమర్షియల్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈయన సినిమాలకు భారీగా కలెక్షన్లు రాకపోయినా పెట్టిన బడ్జెట్ వచ్చేది. క్రమంగా ఈయన సినిమాలు ఓకే విధంగా ఉండటం.. కొత్తగా ప్రయత్నించకపోవడంతో ప్రేక్షకులకు బోర్ కొట్టేది. దాంతో థియేటర్లలో ఈయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపడం తగ్గించారు. ఈయన నటించిన గత ఐదారు సినిమాలు కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఇక ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. సన్నిలియోన్, రాజ్పుత్పాయల్ ఈ సినిమాలో భాగమవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా విష్ణు ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. విష్ణు కెరీర్లో ఇప్పటివరకూ చేయని సరికొత్త పాత్రలో నటించనట్లు ఫస్ట్‌లుక్ గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ చిత్రంలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత, నిర్మాత కోనవెంకట్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు క్రీయేటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అవ ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతాన్ని స్వర పరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

