Manchu Manoj | ఆసక్తి రేకెత్తిస్తున్న వాట్ ది ఫిష్ గ్లింప్స్.. కంబ్యాక్ కోసం మనోజ్ గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టున్నాడుగా..!
What The Fish Movie | అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం 'ఒక్కడు మిగిలాడు' అనే సినిమాలో హీరోగా కనిపించాడు మంచు మనోజ్. ఆ తర్వాత రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. మళ్లీ ఇప్పటివరకు తెరపై కనిపించలేదు.
What The Fish Movie | అప్పుడెప్పుడో ఆరేళ్ల క్రితం ‘ఒక్కడు మిగిలాడు’ అనే సినిమాలో హీరోగా కనిపించాడు మంచు మనోజ్. ఆ తర్వాత రెండు సినిమాల్లో అతిథి పాత్రల్లో మెరిసాడు. మళ్లీ ఇప్పటివరకు తెరపై కనిపించలేదు. మధ్యలో ‘అహం బ్రహ్మస్మి’ అనే పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా వదిలాడు. కానీ ఆదిలోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ఐదేళ్ళుగా మంచు మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దాంతో మనోజ్ సినిమాలు మానేశాడు అనే అనుకున్న టైమ్‌లో ‘వాట్ ది ఫిష్’ అంటూ నాలుగు నెలల క్రితం కొత్త సినిమాను ప్రకటించాడు. టైటిల్‌తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ వెంటనే రిలీజైన ప్రీ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
వరుణ్ కోరుకుండ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. శనివారం మనోజ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. లేటెస్ట్గా రిలీజైన గ్లింప్స్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగింది. టీజర్లో పెద్దగా ఏమి రివీల్ చేయలేదు కానీ.. మనోజ్ మాత్రం సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నట్లు స్పష్టం అయింది. టీజర్లో డ్రగ్స్, గేమింగ్ వంటి వాటిని చూపించారు. అదే విధంగా టీజర్లో మనోజ్ గుడ్ అండ్ బ్యాడ్ లుక్స్‌లో రెండు స్వభావాలున్న పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా హింస కూడా ఈ సినిమాలో ఎక్కువ మోతాదులోనే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా టీజర్‌తో సినిమాపై మంచి హైపే క్రియేట్ అయింది.
శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాది ద్వితియార్థంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీనితో పాటు మంచు మనోజ్ ఎల్ఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. భాస్కర్ బంటుపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

