Chamundeshwari Temple | మంచు మనోజ్ దంపతులు మైసూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చాముండేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. భార్య మౌనికతో పాటు పిల్లలు ధైరవ్, దేవసేన శోభలతో కలిసి ఆలయానికి విచ్చేసిన ఆయన, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇక మంచు మనోజ్ ప్రస్తుతం సినిమాల పరంగా ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. హనుమా రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తుండగా, మారియా ర్యాబోషాప్కా హీరోయిన్గా నటిస్తున్నారు. సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను 1897 మరియు 1920ల మధ్య బ్రిటిష్ కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు, నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాదా’ చిత్రంలోనూ మనోజ్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూరులో శరవేగంగా జరుగుతోంది. షూటింగ్ షెడ్యూల్ నుంచి కాస్త విరామం దొరకడంతో ఆయన తన కుటుంబంతో కలిసి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు.