NTR Birthday Mashup | తారక్ బర్త్‌డే జోష్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్పెషల్ మ్యాషప్స్!
NTR Birthday Mashup | గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానుల హంగామా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.
Happy Birthday NTR | గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నందమూరి అభిమానుల హంగామా నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. తారక్ బర్త్‌డేను పురస్కరించుకుని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలు, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు సరికొత్త సర్ప్రైజ్లతో అభిమానుల్లో మరింత జోష్ నింపుతున్నాయి. ఇందులో భాగంగా టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘గీతా ఆర్ట్స్’ మరియు ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థ ‘శ్రేయాస్ మీడియా’ ఎన్టీఆర్ కెరీర్‌లోని బెస్ట్ మూమెంట్స్‌తో రూపొందించిన పవర్ఫుల్ బర్త్‌డే మ్యాషప్ వీడియోలను విడుదల చేశాయి.
ముందుగా శ్రేయాస్ మీడియా విడుదల చేసిన ‘Man of Masses NTR Birthday Special Mashup’ వీడియో యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్ సినీ ప్రస్థానంలోని ఐకానిక్ మాస్ సీన్స్, ఆయన పలికిన పవర్ఫుల్ డైలాగ్స్, వెండితెరపై ఆయన వేసిన మైండ్ బ్లోయింగ్ స్టెప్పులను కలగలిపి ఈ మ్యాషప్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్న హై-వోల్టేజ్ మ్యూజిక్ తారక్ ఎలివేషన్ సీన్స్‌కు పీక్స్ అనిపించేలా ఉంది. ‘హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్’ అంటూ శ్రేయాస్ మీడియా లీడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మరోవైపు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ సైతం నందమూరి అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. ‘Happy Birthday Man of Masses NTR’ అంటూ గీతా ఆర్ట్స్ అధికారికంగా వదిలిన స్పెషల్ మ్యాషప్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ నటనలోని నవరసాలను, ఆయనకున్న అసాధారణమైన క్రేజ్‌ను ఎలివేట్ చేస్తూ ఈ వీడియోను కట్ చేశారు. నటనలో తారక్‌ను కొట్టేవాడే లేడనే రేంజ్లో ఉన్న విజువల్స్ మరియు గీతా ఆర్ట్స్ పంపిన పుట్టినరోజు శుభాకాంక్షలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

