Mammootty | ప్రశంసలే విమర్శలకు దారితీశాయి.. క్షమాపణలు కోరిన మమ్ముట్టి
Mammootty | మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నారు. యువ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ని ప్రశంసిస్తూ ఆయన మాట్లాడిన మాటలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా మమ్ముట్టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంతో జోసెఫ్‌కు మమ్ముట్టి క్షమాపణలు చెప్పారు.

‘నిన్న జరిగిన 2018 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు జోసెఫ్‌ను ప్రశంసిస్తూ నేను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయి. ఇందుకుగానూ క్షమాపణలు కోరుతున్నా. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటానని హామీ ఇస్తున్నా. అందరికీ ధన్యవాదాలు’ అని పోస్టు చేశాడు.
జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘2018’. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈవెంట్లో భాగంగా నటుడు మాట్లాడుతూ… ‘జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు’ అంటూ ప్రశంసించారు. అయితే మమ్ముట్టి మాటలను కొందరు నెగెటివ్‌గా తీసుకున్నారు. జోసెఫ్‌ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారంటూ విమర్శించడం మొదలు పెట్టారు. దీంతో చివరకు మమ్ముట్టి సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్