Patriot OTT | ఓటీటీలోకి మమ్ముట్టి, మోహన్‌లాల్ ‘పేట్రియాట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Patriot | మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'పేట్రియాట్' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
Patriot | మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర కథానాయకులు మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘పేట్రియాట్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో పొలిటికల్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ5 (ZEE5) ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకోగా.. జూన్ 5 నుంచి ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు జీ5 వెల్లడించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
మమ్ముట్టి, మోహన్‌లాల్ చాలా కాలం తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఇందులో ఫహాద్ ఫాజిల్ ప్రధాన విలన్ పాత్రలో నటించారు. నయనతార, కుంచాకో బోబన్, రేవతి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు. నేషనల్ సెక్యూరిటీ, ప్రభుత్వ నిఘా నెట్వర్క్ మరియు అంతర్జాతీయ కుట్రల చుట్టూ సాగే ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను థియేటర్లలో మిస్ అయిన వారు జూన్ 5 నుండి జీ5లో వీక్షించవచ్చు.
📢 Big “M” s Movie Streaming Announcement 🔥#Patriot (Malayalam) Streaming from June 5 on Malayalam, Tamil, Telugu, Kannada & Hindi on Zee5 🍿!!#OTT_Trackers pic.twitter.com/YEsYDSFFQs
— OTT Trackers (@OTT_Trackers) May 22, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mohammed Shami: టెస్టు క్రికెట్‌కు అల్విదా ప్రకటించిన బౌలర్ షమీ.. వీడియో
Doodimetla Balaraj Yadav | కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ.. దూదిమెట్లకు బెయిల్ మంజూరు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

