కల నెరవేరినట్లయింది
మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘ముఫాసా- ది లయన్ కింగ్'. బారీ జెంకిన్స్ దర్శకుడు. 2019లో వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్'కి కొనసాగింపుగా వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’కి అగ్ర హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘ముఫాసా- ది లయన్ కింగ్’. బారీ జెంకిన్స్ దర్శకుడు. 2019లో వచ్చిన యానిమేటెడ్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్’కి కొనసాగింపుగా వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’కి అగ్ర హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ముసాఫా: ది లయన్ కింగ్’కి వాయిస్ ఇవ్వడం పట్ల తన ఎక్సయిట్మెంట్ని సోషల్ మీడియా ద్వారా ఆయన పంచుకున్నారు. ‘ముఫాసా ఇప్పటివరకూ వచ్చిన అత్యంత పాపులర్ పాత్రల్లో ఒకటి. నాకు ఇష్టమైన పాత్ర. నేను ఎప్పట్నుంచో చూస్తున్న పాత్ర ‘ముఫాసా’. తన కుటుంబాన్ని ముఫాసా చూసుకునే తీరు నిజంగా అద్భుతం. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పడం గౌరవంగా భావిస్తున్నా. ‘ముఫాసా’కు డబ్బింగ్ చెప్పడంతో నా కల నెరవేరినట్టయ్యింది.’ అని మహేష్ పేర్కొన్నారు. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

