Mahesh Babu | మహేశ్ రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు : నమ్రతా శిరోద్కర్
Namrata Shirodkar | హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ముఫాసా- ది లయన్ కింగ్’. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ది లయన్ కింగ్’ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Namrata Shirodkar | హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘ముఫాసా- ది లయన్ కింగ్’. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ది లయన్ కింగ్’ సినిమాకు ఈ చిత్రం ప్రీక్వెల్‌గా వస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగు వెర్షన్లో అగ్ర హీరో మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర అయిన ‘ముఫాసా’కి బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తెలుగులో మహేశ్ తన గాత్రాన్ని అందించారు.
అయితే ఈ మూవీ విడుదల తేదీ దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా పోస్టర్ని ఆదివారం హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఇక ఈ వేడుకకు మహేశ్‌బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నమ్రత మాట్లాడుతూ.. మహేశ్ ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. అందుకే ఈ వేడుకకు రాలేకపోయాడు. ఇది అనుకోకుండా జరిగింది. ఇది ఫ్యామిలీ ఎమోషనల్ రైడ్. మహేశ్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు. తప్పకుండా అందరికీ నచ్చుతుందని తెలిపారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. SSMB29గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది.
#MaheshBabu Couldn’t be here because he is busy with #SSMB29 💥🔥
– #Namratha at #MufasaTheLionKing Press meet pic.twitter.com/FKwgIDxG5M
— Filmyscoops (@Filmyscoopss) December 2, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

