MAD | ఈ రోజుల్లో కడుపులు చెక్కలై నవ్వి నవ్వి చచ్చిపోయేంత మంచి సినిమాలు కూడా వస్తున్నాయా అనుకోవచ్చు.. కానీ అప్పుడప్పుడూ వస్తున్నాయి. చిన్న సినిమాలే కానీ మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లేదు అవి. అలా వచ్చి హిట్ అందుకున్న రీసెంట్ చిత్రం ‘మ్యాడ్'(MAD). సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించగా ఎన్టీఆర్ (NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక ఈ సినిమాకు కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్టోబరు 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం చిన్నా సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఉండే మజా ఏంటో ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix) వేదికగా నవంబర్ 03 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.
కథేంటంటే:
మనోజ్(రామ్‌నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్శోభన్).. ముగ్గురూ రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు. బాస్కెట్‌బాల్ పోటీలు ఈ ముగ్గురునీ ఒకటి చేశాయి. ముగ్గురూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇదిలావుంటే.. శృతి (గౌరిప్రియ)అనే అమ్మాయిని మనోజ్ ప్రేమిస్తుంటాడు. జెన్నీ(అనంతిక) అనే అమ్మాయి అశోక్‌ని ప్రేమిస్తుంటుంది. వీరిప్రేమ వ్యవహారాలు ఇలావుంటే, మూడోవాడైన దామోదర్‌కి వెన్నెల అనే అమ్మాయి నుంచి ప్రేమలేఖ వస్తుంది. దాంతో వెన్నెల ప్రేమలో పడిపోయాడు దామోదర్. నాలుగేళ్లు ఆ అమ్మాయిని చూడకుండానే ప్రేమిస్తున్నాడు. హాస్టల్‌కి ఫోన్‌చేసి రోజూ దామోదర్‌తో వెన్నెల మాట్లాడుతుంది కానీ కనపడదు. ఇక వెన్నెల కోసం వెతికే క్రమంలో దామోదర్‌కి ఓ నిజం తెలుస్తుంది. ఏంటా నిజం? ఈ ప్రశ్నకు సమాధానమే మిగిలిన కథ.