ఆద్యంతం నవ్వుల విందు
బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్, మోక్ష జంటగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్'. ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు.
బిగ్‌బాస్ ఫేమ్ సొహైల్, మోక్ష జంటగా నటించిన చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’. ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మించారు. ఈ నెల 30న విడుదలకానుంది. బుధవార ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. సొహైల్ మాట్లాడుతూ ‘కథపై నమ్మకంతో టీమ్ అంతా కష్టపడ్డాం. ప్రేక్షకులకు ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. సినిమాపై నమ్మకంతో నిర్మాత హరిత గోగినేని సొంతంగా రిలీజ్ చేస్తున్నారు’ అని అన్నారు.
‘సినిమాకు వచ్చిన ప్రేక్షకులు చక్కటి ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకొస్తారు. వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలుంటాయి. ట్రైలర్, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. సొహైల్ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చుతుంది. తన సంపాదనలో ఎంతో మందికి ఆయన సహాయం చేస్తున్నారు’ అని దర్శకుడు పేర్కొన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, తప్పకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని నిర్మాత హరిత గోగినేని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

