Dasaradh | చాలా మంది జీవితాల్లో జరిగే కథ లవ్ యూ రామ్ : నిర్మాత దశరథ్
Dasaradh | డైరెక్టర్ దశరథ్ (Dasaradh) నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. యూత్‌ఫుల్ స్టోరీ లవ్ యూ రామ్ (Love You Ram ) తెరకెక్కిస్తున్నారు దశరథ్. లవ్ యూ రామ్ జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
Dasaradh | మిస్టర్ పర్ఫెక్ట్, సంతోషం సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దశరథ్ (Dasaradh) నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. దశరథ్ యూత్‌ఫుల్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు లవ్ యూ రామ్ (Love You Ram ). ఈ చిత్రానికి రైటర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దశరత్ స్నేహితుడు డీవై చౌదరి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. రోహిత్ బెహల్, అపర్ణా జనార్దనన్ నటిస్తోన్న లవ్ యూ రామ్ జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఈ నేపథ్యంలో సినిమా విశేషాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు దశరథ్. చిన్ననాటి నుంచి అమ్మాయి ఓ అబ్బాయిని ఇష్టపడుతుంది. అతడు ఆమెకు స్పూర్తిగా నిలుస్తాడు. అయితే కాలక్రమేణా అతడి స్వభావం మారిపోయి డిఫరెంట్ వ్యక్తిగా మారితే.. ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి..? అనేది స్టోరీ. ఈ జనరేషన్‌కు నచ్చే కథ ఇది. చాలా మంది జీవితాల్లో జరిగే కథ ఇది. ఫస్ట్ నైట్ వరకు సాగే ప్రేమ కథ. రోహిత్ బెహల్, అపర్ణా జనార్ధనన్ లాంటి నటీనటులు దొరకడం తమ అదృష్ణమన్నాడు దశరథ్.
రోహిత్ బెహల్, అపర్ణా జనార్ధనన్ చాలా డెడికేషన్‌తో అద్భుతంగా నటించారు. ఈ తరంలోని యాక్టర్లు చాలా నిజాయితీ పరులు. ఇది యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ. ప్రతీ ఒక్కరికీ నచ్చుతుందని చెప్పుకొచ్చారు దశరథ్. ఈ సందర్భంగా లవ్ యూ రామ్ మంచి విజయాన్ని అందుకోవాలని సాయికుమార్, శ్రీకాంత్ చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
లవ్ యూ రామ్ ట్రైలర్
The Dialogue King, #Saikumar Garu, wishing @directordasarad & @DYChowdary1 & the entire team, tremendous success for #LoveYouRam 💖
Don’t Miss in Theatres Tomorrow 🎞️💥@RohitBehal77 @AparnaJan @vedakondapalli #ManaEntertainment @SriChakraFilms_ pic.twitter.com/A717shQFJP
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 29, 2023
. @actorsrikanth garu wishing Big Success to @directordasarad & @DYChowdary1 and the entire #LoveYouRam crew ❤️
Movie will be Released In Cinemas Tomorrow 🎥💥@RohitBehal77 @AparnaJan @vedakondapalli #ManaEntertainment @SriChakraFilms_@adityamusic pic.twitter.com/j5wko7wAQQ
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 29, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

