Kriti Sanon | ఏఐ నన్ను భయపెడుతోంది.. సోషల్ మీడియాపై కృతి సనన్ ఆందోళన!
Kriti Sanon | సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Kriti Sanon | సమాజంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒక మీడియా సమ్మిట్లో ఆమె మాట్లాడుతూ, టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, దాన్ని నియంత్రించే చట్టాలు మాత్రం ఆ స్థాయిలో లేవని అన్నారు. అసలు ఫోటో ఏది, ఏఐ సృష్టించిన ఫోటో ఏది అని గుర్తించడం చాలా కష్టంగా మారిందని ఆమె తెలిపారు.
సోషల్ మీడియా వేదికలపై ఏఐ ద్వారా వచ్చే తప్పుడు చిత్రాలను తొలగించడం చాలా సవాలుగా మారిందని కృతి సనన్ చెప్పారు. ఉదాహరణకు ఇన్ స్టాగ్రామ్ లో తన పోలికలతో ఎవరో ఒకరు ఏఐ ఇమేజ్ పోస్ట్ చేస్తే, దాన్ని రిపోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా ‘ఇది నా ఏఐ-జనరేటెడ్ ఇమేజ్, కాబట్టి దీన్ని తొలగించాలి’ అనే ఆప్షన్ కూడా ప్రస్తుతం అందుబాటులో లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా, దానికి తగినట్లుగా సోషల్ మీడియా నిబంధనలు ఇంకా మారలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
ఏఐ టెక్నాలజీ తనను తీవ్రంగా భయపెడుతోందని కృతి సనన్ అన్నారు. ఇది కేవలం ఒక టూల్ మాత్రమేనని, కానీ టూల్ ఎంత పదునుగా ఉంటే అది అంత ప్రమాదకరమని హెచ్చరించారు. కొత్త ఆవిష్కరణలకు తాను పూర్తిగా అనుకూలమే అయినప్పటికీ, వ్యక్తిగత హక్కుల విషయంలో ఏఐ తెచ్చిపెడుతున్న మార్పులు చాలా భయానకంగా ఉన్నాయని, తక్షణమే కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

