బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు సత్యదేవ్ (Satya Dev). ఈ హీరో వీవీ గోపాల కృష్ణ (VV Gopala Krishna) డైరెక్షన్లో కృష్ణమ్మ (Krishnamma) సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. సత్యదేవ్ 25వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. కృష్ణమ్మ టీజర్‌ను ఆగస్టు 4న ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. తాజా పోస్టర్లో దుర్గమ్మ ముందు సత్యదేవ్ కత్తి పట్టుకుని రౌద్రం ప్రదర్శిస్తూ..సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు . యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సన్నీకుర్రపాటి సినిమాటోగ్రాఫర్. కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Teaser out on 4th August at 11.07 AM#VVGopalakrishna @kaalabhairava7 @ArunachalaCOffl #KoratalaSiva pic.twitter.com/ZQrbU4ByRB
— Satya Dev (@ActorSatyaDev) August 2, 2022