Korean Kanakaraju Teaser | ‘కొరియన్ కనకరాజు’ టీజర్ రిలీజ్.. రాయలసీమ మాస్, కొరియన్ స్వాగ్తో అదరగొట్టిన వరుణ్ తేజ్
Korean Kanakaraju Teaser | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న వినూత్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజుపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Korean Kanakaraju Teaser | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్న వినూత్న హారర్ కామెడీ చిత్రం కొరియన్ కనకరాజుపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేసింది. వినోదం, హారర్, యాక్షన్, కామెడీ అంశాలతో నిండిన ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.
టీజర్ ప్రారంభంలో వరుణ్ తేజ్ తన రాయలసీమ గ్రామాన్ని పరిచయం చేసే సన్నివేశాలు కనిపిస్తాయి. అయితే ఆ విజువల్స్‌తో పాటు బ్యాక్‌డ్రాప్‌లో కొరియాకు సంబంధించిన దృశ్యాలు కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. రాయలసీమ నేపథ్యంలో ప్రారంభమయ్యే కథ ఎలా కొరియాతో అనుసంధానమవుతుందనే అంశాన్ని దర్శకుడు ఆసక్తికరంగా దాచిపెట్టారు. ఈ చిత్రంలో కనకరాజు పాత్రలో వరుణ్ తేజ్ పక్కా రాయలసీమ యువకుడిగా కనిపిస్తారు. ఆయనకు స్నేహితుడిగా నటుడు సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇద్దరి మధ్య వచ్చే సంభాషణలు నవ్వులు పంచేలా ఉండనున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది.
అదే సమయంలో వరుణ్ తేజ్ మరో గెటప్‌లో కొరియన్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో కనిపించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. స్టైలిష్ మేకోవర్, బాడీ లాంగ్వేజ్, స్వాగ్తో పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించిన వరుణ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. టీజర్లో వరుణ్ తేజ్ పాత్రకు దెయ్యం పట్టిన తర్వాత జరిగే పరిణామాలను హాస్యభరితంగా చూపించారు. హారర్, కామెడీ కలయికలో వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ రెండు విభిన్నమైన షేడ్స్‌లో చూపించిన నటన, కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. సంగీత దర్శకుడు ఎస్. థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మరింత బలం చేకూర్చింది. హారర్ సన్నివేశాల్లో ఉత్కంఠను, కామెడీ సన్నివేశాల్లో వినోదాన్ని సమానంగా ఎలివేట్ చేస్తూ థమన్ తన మార్క్‌ను మరోసారి చూపించారు. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలతో సినిమాను రూపొందిస్తోంది. క్రాస్-కల్చరల్ హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనున్నట్లు టీజర్ ద్వారా అర్ధమవుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

