కిరణ్ అబ్బవరం హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జాయ్ ఫిల్మ్స్ పతాకంపై సుధాకర్ చాగంటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కేఏ13’ అనే వర్కింగ్ టైటిల్‌తో కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
ఇందులో నాయకానాయికలిద్దరూ గణేశుడి విగ్రహం ముందు నిలబడి ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తున్నామని, కిరణ్ అబ్బవరం పాత్ర మునుపెన్నడూ చూడని కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. దేవికభట్, శరత్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం.