భజ గోవిందం బ్రతుకే కోలాహలం
హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. దేవిక భట్ కథానాయిక. సుధాకర్ చాగంటి దర్శకుడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని మేకర్స్ ప్రారంభించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘భజ గోవిందం..’ను గురువారం విడుదల చేశారు.
హీరో కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రియాలిటీ’. దేవిక భట్ కథానాయిక. సుధాకర్ చాగంటి దర్శకుడు. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని మేకర్స్ ప్రారంభించారు. ఈ సినిమాలోని తొలిపాట ‘భజ గోవిందం..’ను గురువారం విడుదల చేశారు. ‘భజగోవిందం.. భజగోవిందం.. బ్రతుకే కోలాహలం.. భజగోవిందం.. భజగోవిందం.. బరువే కాదే క్షణం..’ అంటూ భక్తిభావంతో కథకు అద్దంపట్టేలా ఈ పాట సాగింది.
సనారే రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరచగా, వైకోమ్ విజయలక్ష్మి ఆలపించారు. పనిని ప్రేమించడం, స్వశక్తితో ఎదగడం ఎంత ముఖ్యమో ఈ పాట చెబుతున్నది. పాటకు తగ్గట్టుగా విజువల్స్ కూడా సాగాయి. హోటల్ నడుపుతూ, కుటుంబ సభ్యులతో విలువైన క్షణాలను గడుపుతున్న హీరోగా కిరణ్ అబ్బవరాన్ని ఈ పాటలో చూడొచ్చు. శరత్‌కుమార్, సాయికుమార్, రోహిణి, అన్నపూర్ణమ్మ, సుదర్శనం తదితరులు ఇతరపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విశ్వాస్ డేనియల్, సహనిర్మాత: సురేశ్ యెర్రా, నిర్మాణం: జాయ్ ఫిల్మ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

