K Ramp Movie | మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. బాక్సాఫీస్ వద్ద కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’
K Ramp Break Even | దీపావళి పండుగ కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' (KRamp) చిత్రం టాలీవుడ్లో కొత్త సంచలనం సృష్టిస్తోంది.
K Ramp Movie | దీపావళి పండుగ కానుకగా విడుదలైన కిరణ్ అబ్బవరం ‘కె ర్యాంప్’ (KRamp) చిత్రం టాలీవుడ్లో కొత్త సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకోవడమే కాకుండా రూ.17 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలిసారిగా మెగా ఫోన్ పట్టిన డెబ్యూ డైరెక్టర్ జైన్స్ నాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యువతరం ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్లకు క్యూ కడుతున్నారు. చిత్ర విజయం పట్ల సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తూ, ఈ విజయాన్ని ఉత్సవంలా జరుపుకుంటున్నారు. ఈ సినిమాలో యూక్తి తరేజా కథానాయికగా నటించగా.. రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించాడు. సాయి కుమార్, నరేష్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కుమార్ (కిరణ్ అబ్బవరం) పుట్టుకతోనే సంపన్నుడు. తండ్రి కృష్ణ (సాయికుమార్) అతి గారబంతో సర్వం సమకూర్చుతాడు. కానీ కుమార్ కి చదువు పట్టదు. పైగా ఎప్పుడూ డ్రింక్ చేస్తూ ఉంటాడు. తనని దారిలో పెట్టాలని కేరళలోని ఓ కాలేజ్ లో చేర్చుతారు. అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు కుమార్. అయితే మెర్సీకి ఓ మానసిక సమస్య వుంటుంది. ఆ సమస్య ఏమిటి? దానికి కారణంగా ఈ ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగిందనేది మిగతా కథ.
Chepinnatte Kumar gadu theaters lo kummi padesadu 🤙😎
𝐃𝐈𝐖𝐀𝐋𝐈 𝐖𝐈𝐍𝐍𝐄𝐑 #KRamp BREAKEVEN DONE IN 3 DAYS 🔥🔥🔥
Book Your Tickets Now..!!
— https://t.co/mckITSiLC7#KRampKaDiwali 🧨 pic.twitter.com/w8bTvqA32a
— BA Raju’s Team (@baraju_SuperHit) October 21, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

