Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
Kiran Abbavaram | యువ నూతన నటుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పుడు జోరు పెంచారు.
Kiran Abbavaram | యువ నటుడిగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఇప్పుడు జోరు పెంచారు. వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, తాజాగా తన అప్‌కమింగ్ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను పంచుకున్నారు. ఒకవైపు కమర్షియల్ హంగులతో పాటు, మరోవైపు సరికొత్త జోనర్లలో నటిస్తూ తన కెరీర్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.
గతంలో వచ్చిన ‘మీటర్’ సినిమా ఫ్లాప్ కావడం తనకెంతో నేర్పించిందని, రొటీన్ కథలను ప్రేక్షకులు ఆదరించరనే సత్యాన్ని ఆ సినిమా ద్వారా గ్రహించానని కిరణ్ ఓపెన్‌గా చెప్పారు. ఇకపై ప్రతి విషయంలోనూ ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రియాలిటీ’ (Reality). మధ్యతరగతి యువకులు పెళ్లి విషయంలో ఎదుర్కొనే ఒత్తిళ్లు, తక్కువ బడ్జెట్లో వివాహం చేసుకోవాలనుకునే కుర్రాడి కష్టాల ఆధారంగా ఈ సినిమా వినోదాత్మకంగా రానుంది. డిసెంబర్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా డిజిటల్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెడుతున్నారు కిరణ్. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గువ్వల చెరువు ఘాట్’ (Guvvala Cheruvu Ghat) అనే వెబ్ సిరీస్‌తో ఆయన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. 1980ల నాటి రాజకీయ నేపథ్యంతో ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందుతున్న ఈ సిరీస్‌లో ఆయన జర్నలిస్ట్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక భారీ చిత్రాల విషయానికొస్తే.. ‘కాంతార: చాప్టర్-1’కి పని చేసిన శ్రీకాంత్ పుప్పాల డైరెక్షన్లో ‘ఇంద్రపుత్ర’ (Indraputra) సినిమా చేస్తున్నారు. ఇది పీరియాడిక్ డ్రామా కాదని, కేవలం తొలి 15 నిమిషాలు మాత్రమే మైథలాజికల్ టచ్ ఉండే నేటి తరపు కథ అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అలాగే తనే స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘హతః’ (Hatha) అనే హారర్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకులను సీట్ల అంచున కూర్చోబెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి వైవిధ్యమైన కథలతో కిరణ్ అబ్బవరం చేస్తున్న ఈ కొత్త ప్రయోగాలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

