యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం మెగా ఫోన్ పట్టనున్నారు. ‘రియాలిటీ’ అనే చిత్రంతో త్వరలో ఆయన దర్శకుడిగా పరిచయం కానున్నారు. మే నెలలో షూటింగ్ ప్రారంభించుకుని, నవంబర్లో దీపావళి కానుకగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల కానున్నది. కిరణ్ అబ్బవరం కేవలం నటుడు మాత్రమే కాదు. తను రచయిత కూడా. గతంలో షార్ట్ ఫిల్మ్స్ రాసి, దర్శకత్వం వహించిన అనుభవం ఆయనకు ఉంది. ఆ అనుభవంతోనే మెగా ఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారు కిరణ్ అబ్బవరం. ఆయన సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రం తెరకెక్కనున్నది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.