షూటింగ్లో భయపడ్డా!
స్వతహాగా తాను భయస్తురాలినని..అందుకే హారర్ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. హిందీ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్న ఈ భామ నటించిన హారర్ చిత్రం ‘భూల్ భులయ్య-2’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. గురువారం కియారా అద్వాణీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు
స్వతహాగా తాను భయస్తురాలినని..అందుకే హారర్ సినిమాల్లో నటించడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందని చెప్పింది ఢిల్లీ సొగసరి కియారా అద్వాణీ. హిందీ అగ్ర కథానాయికల్లో ఒకరిగా చలామణీ అవుతున్న ఈ భామ నటించిన హారర్ చిత్రం ‘భూల్ భులయ్య-2’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. గురువారం కియారా అద్వాణీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నేను రీట్ అనే పాత్రలో కనిపించబోతున్నా.
నా పాత్ర ప్రేక్షకుల్ని ఎంతగానో భయపెడుతుంది. ఇలాంటి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం చాలా కొత్తగా అనిపించింది. ఒక్కోసారి షూటింగ్ టైంలో కూడా భయపడ్డా. తెరపై నన్ను నేను చూసుకొని నమ్మలేకపోయాను. హారర్ జోనర్ ఇష్టం లేకపోయినప్పటికీ నటిగా అన్ని రకాల పాత్రల్ని సమర్థవంతంగా పోషించగలననే భరోసా కోసం ఈ సినిమాలో భాగమయ్యా’ అని చెప్పుకొచ్చింది. అనీష్బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకులముందుకురానుంది. కియారా అద్వాణీ తెలుగులో రామ్‌చరణ్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
School Van | కురవిలో స్కూల్ వ్యాన్ బోల్తా, 12 మంది విద్యార్థులకు గాయాలు.. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా?
Samantha | సినిమాలకు మించి వ్యాపారాల్లో సమంత జోరు.. 8 నెలల్లోనే రూ.120 కోట్ల టర్నోవర్‌తో హాట్ టాపిక్!
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

