బాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో ‘ఖిలాడీ’
‘రాక్షసుడు’ చిత్రంతో విజయాన్ని అందుకున్న నిర్మాత కోనేరు సత్యనారాయణ తాజాగా పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో మాస్ హీరో రవితేజతో ‘ఖిలాడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించారు. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి నాయికలు. తాజాగా సెన్సార్ నుంచి ‘యూ.ఏ’ సర్టిఫికెట్ పొందిందీ సినిమా. ఈ నెల 11న తెలుగుతో పాటు హిందీలో విడుదలవుతున్న సందర్భంగా ‘ఖిలాడీ’ చిత్ర విశేషాలను తెలిపారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. ఆయన మాట్లాడుతూ..
రవితేజకు సరిపోయే కథ
దర్శకుడు రమేష్ వర్మతో మేము ‘రాక్షసుడు’ సినిమాను నిర్మించాం. అది మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ‘ఖిలాడీ’ కథను రమేష్ వర్మ చెప్పారు. నాకు బాగా నచ్చింది. రవితేజకు ఈ కథ సరిపోతుందని అనిపించింది. ఆయనకు చెబితే అంగీకరించారు. సెట్స్ మీదకు వెళ్లేసరికి ఆలస్యమవుతుందేమో అనుకున్నాం గానీ వెంటనే రవితేజ చేద్దామని ముందుకొచ్చారు. నేను ఎప్పుడూ కథను నమ్ముతాను. సినిమాకు చేర్చే మిగతా హంగులన్నీ తర్వాతే. కథ బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు. నా గత చిత్రం ‘రాక్షసుడు’ విషయంలోనూ, తమిళంలో రీమేక్ చేసిన ‘పెళ్లి చూపులు’ చిత్రంతోనూ అదే నిరూపితం అయ్యింది.
కుటుంబమంతా చూసేలా..
వాణిజ్య అంశాలు ఉంటూనే కొత్త నేపథ్యంతో సినిమా ఉంటుంది. ఇప్పటిదాకా ఇలాంటి తరహా సినిమా రాలేదు. సినిమా నిర్మాణంలో రాజీ పడకుండా అత్యున్నత విలువలతో తెరకెక్కించాం. ఇటలీలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. చాలా ైస్టెలిష్ గా, బాలీవుడ్ సినిమా చూస్తున్నట్లు అనిపిస్తుంది. ‘ఖిలాడీ’ సినిమా విజయం మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము. రమేష్ వర్మ నాకు సినిమా చూపించగానే బాగా నచ్చింది. సంతోషంతో ఆయనకు కారు బహుమతి ఇచ్చాను.
అబ్బాయి కోసం నిర్మాతగా..
తల్లిదండ్రులు తాము ఏ రంగంలో ఎదగలేకపోయారో ఆ రంగంలోకి తమ పిల్లల్ని పంపించాలని చూస్తుంటారు. అది సరైనది కాదు. వాళ్ల అభిరుచిని గుర్తించి ప్రోత్సహించాలి. నాకు విద్యాసంస్థలు, ఇతర వ్యాపారాలు ఉన్నా మా అబ్బాయి హవీష్‌కు సినిమాలంటే ఇష్టం కాబట్టి నిర్మాతగా మారాను. హవీష్ ప్రస్తుతం ‘సంజయ్ రామస్వామి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆ కథ అద్భుతంగా ఉంటుంది. ‘రాక్షసుడు 2’ చిత్రంతో పాటు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ‘యోధ’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం.
ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీ
పిల్లలకు చదువులతో పాటు వారికి ఇష్టమైన రంగాల్లో ఎదగనివ్వాలి. అందుకే హైదరాబాద్‌లో వంద ఎకరాల్లో ఒక యూనివర్సిటీ ప్రాంగణానికి రూపకల్పన చేస్తున్నాం. ఇందులో ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ విభాగాల మీద దృష్టి పెట్టబోతున్నాం. ప్రపంచస్థాయి టెక్నాలజీతో ఎంటర్టైన్మెంట్ యూనివర్సిటీని అందుబాటులోకి తీసుకొస్తాం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

