స్త్రీ సామ్రాజ్య నాయకి
అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన వెబ్‌సిరీస్ ‘అక్క’.
అధికారం, వారసత్వం, ప్రతీకారం నేపథ్యంతో సాగే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో రూపొందిన వెబ్‌సిరీస్ ‘అక్క’. ఇందులో మాతృస్వామ్య సామ్రాజ్యానికి నాయకత్వం వహించే ‘భవానీ అక్క’గా కీర్తి సురేశ్ నటించారు. రాధికా అప్టే కీలకపాత్రధారి. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు ధర్మరాజ్శెట్టి దర్శకుడు. ఈ నెల 30న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నది.
ఈ సందర్భంగా ఈ సిరీస్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. తరతరాలుగా మహిళలే ముందుండి నడిపిస్తూ, తమ అధికారాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్న పేర్రూరు అనే రాజ్యంలో జరిగే ఆసక్తికరమైన అంశాల చుట్టూ ఈ సిరీస్ నడుస్తుందని ట్రైలర్ చెబుతున్నది. వారసత్వానికీ, ఆధిపత్యానికీ మధ్య పోరాటంగా ఈ సిరీస్ సాగుతుందని, ఇద్దరు శక్తివంతమైన మహిళల మధ్య సాగే పోరాటమే ఈ సిరీస్ అని మేకర్స్ తెలిపారు.
వారసత్వాన్ని కాపాడుకునేందుకు ఎంతదూరమైన వెళ్లే వ్యక్తిగా ఇందులో కనిపిస్తానని, ఇది సవాళ్లతో కూడుకున్న పాత్ర అని, కథ సాగే కొద్దీ తన పాత్రలో విభిన్న కోణాలు చూస్తారని కీర్తి సురేశ్ తెలిపారు. తన్వీ ఆజ్మీ, మహేశ్ మంజ్రేకర్, అన్షుమన్ పుష్కర్, మోనికా పన్వార్ ఇందులో ఇతర పాత్రధారులు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

