Kangana Ranaut | బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్ ప్రేమలో పడిందని బీ టౌన్లో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా కంగనా ఓ వ్యక్తితో కలిసి నడుస్తున్న ఫొటోలు కెమెరా కంట పడ్డాయి. దీంతో కంగనా ప్రేమలో పడిందా.? ఆ ఫొటోలోని మిస్టరీ వ్యక్తి ఎవరు? అంటూ జనాలు తెగ వెతకడం మొదలుపెట్టారు. ఇక ఆంగ్ల పత్రికల్లో కూడాకంగనా లవ్ లో పడినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కంగనా తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
నాతో పాటూ కనిపించిన ఈ మిస్టరీ మ్యాన్ ఎవరు అని నన్ను చాలా మంది అడిగారు. కొంత మంది అయితే మెసేజీలు పెట్టడం ఫోన్లు చేయడం కూడా చేశారు. అయితే వీళ్ళందరికీ నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. ఆడా మగా కలిసి కనిపిస్తే చాలు వాళ్లు డేటింగ్లో ఉన్నట్టు భావిస్తే ఎలా అని కంగనా ప్రశ్నించింది. వారి మధ్య ప్రేమ కాకుండా అనేక ఇతర విషయాలు కూడా ఉండొచ్చు. వారు ఫ్రెండ్స్, తోబుట్టువులు, సన్నిహితులు, లేదా ఒకరు హెయిర్ స్టైలిస్ట్ అయితే మరొకరు వారి ఫ్రెండ్లీ కస్టమర్ కూడా కావచ్చు అంటూ కంగనా రాసుకోచ్చింది. దీంతో కంగనాతో ఉంది హెయిర్ స్టైలిస్ట్ అని తెలిసిపోయింది.
కంగనా ప్రస్తుతం ఎమర్జెన్సీ అనే చిత్రంలో నటిస్తుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్నా ఈ చిత్రంలో కంగనా ఇందిరా గాంధీ పాత్ర పోషిస్తుంది.