‘పిట్టకథ’ ఫేమ్ సంజయ్ రావు హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్లమ్ డాగ్ హస్బెండ్’. ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హీరో కళ్యాణ్‌రామ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘స్లమ్ ఏరియాలో ఉండే ఒక అమ్మాయి, అబ్బాయి పెళ్లి కోసం పడే తాపత్రయం, తనకున్న గండం నుంచి గట్టెక్కడానికి తొలుత కుక్కని పెళ్లి చేసుకున్న అబ్బాయి ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్న వైవిధ్యమైన కామెడీ సినిమా ఇది.ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని పంచే చిత్రమిది’ అన్నారు. ప్రణవి మానుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో.