అవినీతిపరులకు సింహస్వప్నం
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’(వర్కింగ్ టైటిల్)లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ పాత్ర గురించి కాజల్ మాట్లాడారు.
అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’(వర్కింగ్ టైటిల్)లో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆ పాత్ర గురించి కాజల్ మాట్లాడారు. బాలకృష్ణ ‘నేలకొండ భగవంత్ కేసరి’ సినిమాలో ఫన్నీగా కనిపించిన తాను, ‘NBK 111’లో మాత్రం సీరియస్ పాత్ర పోషిస్తున్నట్టు ఆ ఇంటర్వ్యూలో కాజల్ పేర్కొన్నారు.
ఫిల్మ్‌వర్గాల సమాచారం ప్రకారం ఇందులో ఆమె నిజాయతీ గల ప్రభుత్వ అధికారిగా కనిపిస్తుందట. అవినీతిపరుల గుండెల్లో వణుకు పుట్టించేలా ఆ పాత్ర సాగుతుందని ఇన్సైడ్ టాక్. ఇందులో బాలకృష్ణ, కాజల్ కాంబినేషన్ సీన్స్ భావోద్వేగపూరితంగా ఉంటాయట. కాజల్ కెరీర్లో ఇప్పటివరకూ కనిపించని భిన్నమైన పాత్ర ఇదని తెలుస్తున్నది. నిజానికి ఈ పాత్రకు ముందు నయనతారను అనుకున్నారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆమె స్థానంలో కాజల్ వచ్చి చేరింది. మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వెంకటసతీశ్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

