Kamal Haasan | నమ్మశక్యంగాని రూపం.. కల్కిలో కమల్ కొత్త అవతారం
ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రధాన తారాగణానికి చెందిన వివిధ పోస్టర్లు, వీడియో గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి.
Kamal Haasan | ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రధాన తారాగణానికి చెందిన వివిధ పోస్టర్లు, వీడియో గ్లింప్స్, టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాయి. సినిమా కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, విడుదలకు ముందు లాస్ట్ పంచ్ అన్నట్టు.. కమల్‌హాసన్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ఈ లుక్‌లో సుప్రీం యాస్కిన్‌గా కమల్ నమ్మశక్యంగాని రూపం.. చూసేవారికి ఆశ్చర్యానికి లోనుచేస్తున్నది. మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కమల్ కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ద్రోణసుతుడైన అశ్వత్థామగా అమితాబ్ నటించిన విషయం తెలిసిందే. 39ఏళ్ల తర్వాత అమితాబ్, కమల్ కలిసి నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం. వీరిద్దరు 1985లో ‘గిరఫ్తార్’ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు.
మళ్లీ ఇన్నాళ్లకు ఈ మైథలాజికల్ సైన్స్‌ఫిక్షన్ ‘కల్కి 2898ఏడీ’ కోసం కలిశారు. మళ్లీ ఈ లెజెండ్స్‌ని ఒకే స్క్రీన్‌పై చూసేందుకు ఆడియన్స్ ఆతృతగా ఆసక్తితో ఎదురు చూస్తున్నారనడంలో సందేహం లేదు. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, దిశాపటానీ కథానాయికలు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ నిర్మించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

