Jigarthanda Double X | తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో.. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ ట్రైలర్ రిలీజ్
Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తండ (Jigarthanda) చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది.
Jigarthanda Double X | కోలీవుడ్ స్టార్ హీరోలు రాఘవా లారెన్స్ (Raghava Lawrence), ఎస్జే సూర్య (SJ Surya) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ (Jigarthanda Double X). 2014లో యాక్షన్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రిలీజై తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన జిగర్తండ (Jigarthanda) చిత్రానికి డబుల్ ఎక్స్ సీక్వెల్‌గా వస్తోంది. (ఇదే సినిమాను తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్(Gaddalakonda ganesh) అంటూ రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.) ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు (karthik subbaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్‌తో పాటు జిగర్తాండ 2 టీజర్లకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. మేకర్స్ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు,
”పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి అంటూ ట్రైలర్ మొదలవుతుంది. నలుపు అంటే అంత చులకనా నీకు అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్ నడుస్తుండగా.. సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి అనే చెప్పాగానే. తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ.. గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను ఎంట్రీ ఇస్తాడు.
ఇక మొదటి పార్ట్ లాగానే జిగర్తాండ డబుల్ ఎక్స్ కూడా రౌడీకి, దర్శకుడికి మధ్య జరిగే సంఘర్షణ చుట్టూనే తిరుగుతుందని అర్థమవుతుంది. అలాగే ఈ సినిమా కథ 1975 నాటి రెట్రో స్టైల్లో సాగుతుందని ఈ ట్రైలర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గిరిజనులను కూడా చూపించడంతో కార్తీక్ సుబ్బరాజు ఏం ప్లాన్ చేసాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 10న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
Nana Kutti | విడుదలకు ముందే భారీ డిమాండ్.. విజయ్ ఆంటోని ‘నాన్న కుట్టి’ డిజిటల్ హక్కులు దక్కించుకున్న ప్రైమ్ వీడియో!
‘నల్లగొండ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

