Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Janhvi Kapoor | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె పాత్రను తెరపై చూపించిన విధానం, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Janhvi Kapoor | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో కథానాయికగా నటించిన జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణపై గతంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆమె పాత్రను తెరపై చూపించిన విధానం, కొన్ని సన్నివేశాలపై ప్రేక్షకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై బాలీవుడ్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’లో జాన్వీ స్పందించింది. ‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై వచ్చిన విమర్శలను ఎలా తీసుకున్నారని కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు జాన్వీ కపూర్ భావోద్వేగంగా స్పందించింది. సినిమాలోని కొన్ని సన్నివేశాలు మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో, నటిగా తాను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందని ఆమె అంగీకరించింది.
సినిమా కోసం ఎంతోమంది కష్టపడినా, ఒక సన్నివేశం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని జాన్వీ అభిప్రాయపడింది.ముఖ్యంగా మహిళల పాత్రలను చిత్రీకరించే విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిందని ఆమె భావించినట్టు తెలుస్తుంది.ఇక ఈ వివాదం గురించి మాట్లాడుతూ, జరిగిన దానికి ఇతరులను నిందించడం తనకు ఇష్టం లేదని జాన్వీ చెప్పింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో కొన్ని సందర్భాల్లో నటీనటులకు సన్నివేశాల చిత్రీకరణ, కెమెరా కోణాల గురించి ముందుగానే పూర్తి వివరాలు తెలియకపోవచ్చని ఆమె అభిప్రాయపడింది. అయితే తనకున్న గుర్తింపు, స్థాయిని ఉపయోగించి అభ్యంతరకరంగా అనిపించిన సన్నివేశాల్లో మార్పులు చేయాలని కోరాల్సిందని జాన్వీ భావించింది.
ఒక నటిగా తన బాధ్యతను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ అనుభవం ఉపయోగపడిందని ఆమె పేర్కొంది. మహిళా పాత్రలను తెరపై చూపించే విధానంపై ఈ వివాదం చర్చకు దారితీసిందని, భవిష్యత్తులో దర్శకులు ఇలాంటి సన్నివేశాలను రూపొందించే ముందు మరింత జాగ్రత్తగా ఆలోచించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడింది. కాగా, ‘పెద్ది’లోని కొన్ని సన్నివేశాలపై విమర్శలు రాగా, అందులో మహిళా పాత్రను చూపించిన విధానంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janhvi Kapoor | ‘పెద్ది’ వివాదంపై జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది నా తప్పే అంటూ కామెంట్
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో ముఖేష్-వర్షిణి ముద్దు ఫొటో కలకలం.. ఝాన్సీకి వార్నింగ్, రోహిత్ ఫైర్!
Malkajgiri Municipal Corporation | ఆయన చెప్పిందే వేదం.. నచ్చిన వారికే పోస్టింగ్‌లు
Sai Pallavi | భారతీయ ఇతిహాసం.. అత్యుత్తమ రూపంలో రామాయణం
Balakrishna | శివ నిర్వాణ దర్శకత్వంలో..? బాలకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

