Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు కావడంతో, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా నిడివిని తగ్గించే క్రమంలో దర్శకుడు నెల్సన్ పలు సన్నివేశాలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
Jailer 2 | సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై వారం రోజులు కావడంతో, సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా సినిమా నిడివిని తగ్గించే క్రమంలో దర్శకుడు నెల్సన్ పలు సన్నివేశాలను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట మోహన్‌లాల్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను కట్ చేసినట్లు ప్రచారం జరగగా, తాజాగా రజనీకాంత్‌కు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని కూడా తొలగించినట్లు సమాచారం. కాగా, ‘జైలర్ 2’లో రజనీకాంత్ అభిమానులను అలరించే ఎన్నో ప్రత్యేక సన్నివేశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో కొన్ని థియేటర్లలో ప్రేక్షకులకు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ‘ఆలా బోలేలో’ అనే పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ పాట ఇంటర్వెల్‌కు కొద్దిసేపటి ముందు వస్తుంది. ఇందులో రజనీకాంత్ ఏకంగా 200 మంది అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేసినట్లు సమాచారం. ఈ సన్నివేశం సినిమాలో ఉండి ఉంటే అభిమానులకు మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందించేదని చెప్పొచ్చు. అయితే తుది ఎడిటింగ్‌లో ఈ భాగాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. నటుడు జాఫర్ సాదిక్ తొలగించిన ఈ సన్నివేశం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిచారు. రజనీకాంత్ సర్ అమ్మాయిల మధ్యలో డ్యాన్స్ చేసిన సన్నివేశాన్ని తాను చూశానని, కానీ అది థియేటర్లలో విడుదలైన చిత్రంలో కనిపించలేదని ఆయన పేర్కొన్నట్లు కథనాలు చెబుతున్నాయి.
దీంతో అసలు ఆ సన్నివేశాన్ని ఎందుకు తొలగించారు? సినిమా నిడివిని తగ్గించేందుకే కట్ చేశారా? లేక కథనం వేగంగా సాగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ఈ సన్నివేశాన్ని తొలగించడానికి గల కారణాలపై చిత్రబృందం నుంచి అధికారిక వివరణ రాలేదు. ఇక ‘జైలర్ 2’లోని మరో ఆసక్తికర అంశం కూడా ఈ పాట చుట్టూనే ఉందని తెలుస్తోంది. కథలో విలన్ తన స్నేహితుడిని చంపిన వ్యక్తి ఇంతకాలం తమతో పాటే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనే విషయాన్ని వెల్లడిస్తాడు. ఈ మలుపు కథలో కీలకమైనదిగా కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని వెల్లడించే సన్నివేశానికి, అంతకుముందు వచ్చే డ్యాన్స్ భాగానికి మధ్య ఉన్న సంబంధం థియేటర్లలో విడుదలైన చిత్రంలో పూర్తిగా స్పష్టంగా కనిపించలేదని సమాచారం. తొలగించిన సన్నివేశం సినిమాలో ఉండి ఉంటే ఈ అంశానికి మరింత స్పష్టత వచ్చేదా? అనే చర్చ జరుగుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | 200 మంది అమ్మాయిలతో ‘తలైవా’ డ్యాన్స్.. థియేటర్లలో ఆ సీన్స్ మిస్!
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

