Ustad Bhagath Singh Movie | ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా క్రేజీ అప్డేట్.. పవన్ అభిమానులకు పండగే..!
Ustad Bhagath Singh Movie Latest Update | ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ఉన్నంత బిజీగా బహుశా ఏ హీరో లేడోమో. మొన్నటి వరకు హరిహర వీరమల్లు ఒక్కటే చేతిలో ఉందనుకుంటే.. ఈ ఏడాది ఏకంగా మరో మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి అందరినీ షాక్‌కు గురిచేశాడు.
Ustad Bhagath Singh Movie Latest Update | ప్రస్తుతం టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ ఉన్నంత బిజీగా బహుశా ఏ హీరో లేడోమో. మొన్నటి వరకు హరిహర వీరమల్లు ఒక్కటే చేతిలో ఉందనుకుంటే.. ఈ ఏడాది ఏకంగా మరో మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఇక రానున్న ఎలక్షన్లలోపు వీలైనన్ని సినిమాలను పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ తన డేట్స్‌ను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం పవన్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్‌సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక పదకొండేళ్ల క్రితం వీళ్ల కాంబోలో వచ్చిన గబ్బర్‌సింగ్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
కాగా ఇప్పుడు అదే కాంబో రిపీట్ కావడంతో పవన్ ఫ్యాన్స్‌లో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ మే 11న విడుదల కానున్నట్లు తెలుస్తుంది. కాగా గబ్బర్‌సింగ్ ఆ రోజుతో 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్లింప్స్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
దీనితో పాటుగా పవన్ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్ సిత్తం రీమేక్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా సుజీత్‌తో ఓజీ అనే గ్యాంగ్‌స్టర్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

