Bunny Vasu | రూపాయి ఆదాయం అర్ధరూపాయి అయ్యింది.. మనల్ని మనం సరిచేసుకోవాలి: సినిమా సంక్షోభంపై నిర్మాత బన్నీ వాస్
Telugu Cinema | తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో, వాటిని కాపాడుకునేందుకు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
Bunny Vasu | తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో, వాటిని కాపాడుకునేందుకు ఎగ్జిబిటర్ల అసోసియేషన్ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం హైదరాబాద్‌లో ‘అంతరించిపోతున్న సినిమా హాళ్లని కాపాడండి’ అనే నినాదంతో నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానంగా థియేటర్ల మనుగడ సాగించాలంటే ‘పర్సంటేజీ విధానం’ తప్పనిసరిగా అమలు చేయాలని, ఇకపై సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు పెంచబోమని ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్పష్టమైన హామీ ఇచ్చింది. గత ఆరు నెలలుగా ఎగ్జిబిటర్ల పరిస్థితి దయనీయంగా ఉందని, నిర్మాతగా తాను వారికి పూర్తి మద్దతు ఇస్తున్నానని చదలవాడ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే అమలులో ఉన్న పర్సంటేజీ విధానాన్ని తెలుగులోనూ పాటించాలని, కేవలం రెంటల్ పద్ధతిపైనే ఆధారపడటం సరికాదని నిర్మాత శిరీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు ఈ విధానానికి అంగీకరించాయని, మిగిలిన వారు కూడా సహకరించాలని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.
అయితే, ఈ సంక్షోభంపై ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ పరిశ్రమ ఎదుర్కొంటున్న లోతైన సమస్యలను విశ్లేషించారు. ప్రస్తుతం థియేటర్ల ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి, చిన్న సినిమాలకైతే పావలాకు పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వందల కోట్ల వసూళ్లు వస్తున్నట్లు కనిపిస్తున్నా, అవి ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదని, కేవలం టికెట్ ధరలు పెంచడం వల్ల వచ్చినవేనని ఆయన గుర్తుచేశారు. హీరోలు సినిమాలు పూర్తి చేయడానికి రెండేళ్ల సమయం తీసుకోవడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని, కేవలం 27 రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి రావడం మరో ప్రధాన కారణమని ఆయన విశ్లేషించారు. మల్టీప్లెక్సుల్లో క్యాంటీన్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయని, కంటెంట్ విషయంలో కూడా నాణ్యత తగ్గడం ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేస్తోందని బన్నీ వాస్ పేర్కొన్నారు. మూల సమస్యలను పరిష్కరించకుండా, తగ్గిపోయిన ఆదాయంలో పర్సంటేజీల కోసం గొడవపడటం వల్ల ప్రయోజనం ఉండదని, ముందుగా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించే చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
రూపాయి ఆదాయం అందరికీ పోయింది, పెద్ద సినిమాలకు కూడా ఆదాయం రూపాయి నుంచి అర్ధరూపాయికి పడిపోయింది. ఈరోజు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయని మనం చూస్తున్నాం. కానీ ఆ కలెక్షన్లు నిజంగా ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల వచ్చినవి కాదు; టికెట్ రేట్లు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చినవని…
— Bunny Vas (@TheBunnyVas) May 13, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

