Samantha Ruth Prabhu | స్టార్ హీరోయిన్ సమంత గర్భవతి అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆమె నటించి, నిర్మించిన సరికొత్త చిత్రం ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకునేందుకు సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరు, మరియు చిత్ర యూనిట్‌తో కలిసి సక్సెస్ మీట్ మరియు కేక్ కటింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
సక్సెస్ వేడుకల్లో సమంత క్యాజువల్ వైట్ టీషర్ట్, జీన్స్ ధరించి కనిపించారు. కొన్ని కెమెరా యాంగిల్స్ మరియు వీడియో క్లిప్స్‌లో ఆమెకు కొద్దిగా ‘బేబీ బంప్’ కనిపిస్తోందని నెటిజన్లు, అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ వార్తలపై మీడియా వర్గాల్లో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. కొందరూ ఈ ప్రెగ్నెన్సీ వార్త నిజమేనని, ఈ ఏడాది డిసెంబర్ 2026లో డెలివరీ ఉండొచ్చని ధృవీకరించినట్లు సమాచారం. అయితే సమంత లేదా రాజ్ నిడిమోరు తమ సోషల్ మీడియా ద్వారా దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు సినిమా విడుదలకు ముందు ఈ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ విపరీతమైన జనం మధ్య సమంత ఇబ్బంది పడకుండా రాజ్ నిడిమోరు ఆమెను ఎంతో కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా దగ్గరకు తీసుకుని నడిపించడం కూడా ఈ ప్రెగ్నెన్సీ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
మరోవైపు, బి.వి. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్‌పై నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా ఏకంగా రూ.13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి క్లీన్ బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకుంది. ఈ చిత్రం సక్సెస్ పట్ల సమంత స్పందిస్తూ సాధారణంగా థియేట్రికల్ ఓపెనింగ్స్ పురుషుల వల్ల వస్తాయనే టాక్ ఉంటుందని, కానీ ఈ సినిమాకు మహిళా ప్రేక్షకులు భారీగా తరలిరావడం చాలా ఆనందంగా ఉందంటూ ‘ఎక్స్’లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
Is sam pregnant ? pic.twitter.com/o9nZD2sfa0
— 𝓓𝓸𝓵𝓵𝔂 🤍 (@dollybiblio) June 20, 2026