కంటెంట్‌ను నమ్ముకునే సినిమాలు చేసే హీరోల్లో ఒకడు టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Shoban). సినిమా సినిమాకు కొత్తదనంతో కూడిన కథలను పరిచయం చేస్తుంటాడీ యాక్టర్. సంతోష్ శోభన్ నటిస్తోన్న కొత్త చిత్రం శ్రీదేవి శోభన్ బాబు. మేకర్స్ ఇవాళ మూవీ టీజర్‌ను విడుదల చేశారు.
‘ఈ రోజు మనం చెప్పుకోబోయే చిత్రం గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ (Gold Box Entertainments) వారి హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ గౌరీ కిషన్ ( Gowri Kishan)..మీ అభిమాన నటీనటులు..కథలోకి వెళ్తే..’అంటూ సాగుతున్న టీజర్ ఫన్‌గా, ఇంట్రెస్టింగ్గా సాగుతూ క్యూరియాసిటీని పెంచుతుంది.
చిన్న పట్టణంలో యువతీ యువకుడికి మధ్య జరిగే స్టోరీ నేపథ్యంలో సినిమా రాబోతుందని టీజర్ చూస్తే తెలుస్తుంది. 96 ఫేం గౌరీ కిషన్ ఈచిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగబాబు, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల కథ, దర్శకత్వం వహిస్తున్నాడు. గతేడాది మారుతి డైరెక్షన్లో మంచి రోజులొచ్చాయి సినిమాతో అందరినీ పలుకరించాడు సంతోష్ శోభన్.