దర్శకుడితో విభేదాలు
వెండితెరపై ఎన్నో దృశ్యకావ్యాలను మలిచిన గొప్ప దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. ఆయన రూపొందించిన ‘దేవదాస్', ‘బాజీరావ్ మస్తానీ’, ‘రామ్ లీల’, ‘పద్మావత్' వంటి చిత్రాలెన్నో మంచి సంగీతం, భారీతనంతో,
వెండితెరపై ఎన్నో దృశ్యకావ్యాలను మలిచిన గొప్ప దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీకి పేరుంది. ఆయన రూపొందించిన ‘దేవదాస్’, ‘బాజీరావ్ మస్తానీ’, ‘రామ్ లీల’, ‘పద్మావత్’ వంటి చిత్రాలెన్నో మంచి సంగీతం, భారీతనంతో, విజువల్ వండర్స్‌గా ప్రేక్షకుల్ని ముగ్ధులను చేశాయి. ఇలాంటి దర్శకుడితో ఏ స్టార్ అయినా కలిసి పనిచేయాలనుకుంటారు. సల్మాన్‌ఖాన్ కూడా ఇలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇన్షాల్లా’ను సంజయ్ లీలా భన్సాలీతో ప్రకటించారు. ఏండ్లు గడుస్తున్నా..ఈ సినిమా కార్యరూపం దాల్చడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను సల్మాన్, సంజయ్ పక్కన పెట్టేశారని తెలుస్తున్నది. ఇక ఈ సినిమా ఎప్పటికీ తెరకెక్కపోవచ్చని అంటున్నారు. హీరో, దర్శకుడి మధ్య వచ్చిన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్లో పనిచేసిన ఓ యూనిట్ మెంబర్ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘ఇన్షాల్లా’ సినిమా గురించి సంజయ్ లీలా భన్సాలీ మాట్లాడినట్లు ఓ బాలీవుడ్ మీడియా సంస్థ కథనాన్ని వెలువరించింది. దీని ప్రకారం సంజయ్ మాట్లాడుతూ…‘సల్మాన్ నాకు మంచి మిత్రుడు. పద్మావత్ సినిమా తర్వాత అతనితో ‘ఇన్షాల్లా’ను తెరకెక్కించాలని ప్రయత్నించాను. ఆలియా భట్‌ను నాయికగా ఎంచుకున్నాను. ఇది మరో గొప్ప సినిమా అవుతుందని ఆశించాను. కలిసి చర్చించడం మొదలుపెట్టాక అతను మారిపోయాడని నేను అనుకున్నా, అతనూ నా గురించి అలాగే అనుకుని ఉంటాను. కలిసి సినిమా చేయకున్నా మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే’ అని చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

