వరుణ్ సందేశ్, ఫర్నాజ్‌శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇందువదన’. మాధవి ఆదుర్తి నిర్మాత. ఎంఎస్ఆర్ దర్శకుడు. జనవరి 1న విడుదలకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ఓ ఫారెస్ట్ ఆఫీసర్‌కు, గిరిజన యువతికి మధ్య మొదలయ్యే ప్రేమకథా చిత్రమిది. లవ్‌స్టోరీకి హారర్, సస్పెన్స్ అంశాలను జోడిస్తూ రూపొందిస్తున్నాం. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నది. సెన్సార్ పూర్తయింది’ అని తెలిపారు. రఘుబాబు, అలీ, నాగినీడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శివకాకాని, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: సతీష్ ఆకేటి.