‘ఇందువదన’ ప్రేమాయణం

వరుణ్‌సందేశ్, ఫర్నాజ్‌శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఇందువదన’. శ్రీబాలాజీ పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.ఆర్ దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇటీవల విడుదల చేసిన ‘వడివడిగా..’ అనే పాటకు మంచి స్పందన లభిస్తోంది. రొమాంటిక్ మెలోడీగా అందరిని ఆకట్టుకుంటోంది. ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాతో వరుణ్‌సందేశ్ రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన పాత్ర చిత్రణ కొత్త పంథాలో ఉంటుంది’ అన్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖవాణి, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.మురళీకృష్ణ, సంగీతం: శివ కాకాని, కథ, మాటలు: సతీష్ ఆకేటి, సహనిర్మాత: గిరిధర్, దర్శకత్వం: ఎం.ఎస్.ఆర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

