War 2 Movie | ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్.. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్
War 2 | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న తాజా చిత్రం వార్ 2.
NTR – Hrithik Roshan | దేవరతో సాలిడ్ హిట్ అందుకున్న అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంలో హృతికి రోషన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. తారక్ కీలక పాత్రలో మెరుస్తున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ సినిమాలో హృతిక్, ఎన్టీఆర్ మధ్య క్రేజీ డ్యాన్స్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా సినిమాలోని పాట కోసమే ఏకంగా 500 మంది డ్యాన్స్ర్లను రంగంలోకి దింపినట్లు వార్తలు వస్తున్నాయి. 500 మంది డ్యాన్సర్లతో హృతిక్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లు ఏ రేంజ్లో ఊగిపోతాయో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. హృతిక్, ఎన్టీఆర్ మధ్య వచ్చే ఈ డ్యాన్స్‌లో మునుపెన్నడూ చూడని విధంగా ఓ సరికొత్త గీతాన్ని తీర్చిదిద్దుతుంది చిత్రబృందం. యష్‌రాజ్ స్టూడియోలో ప్రస్తుతం ఈ డ్యాన్స్ షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

