Homebound Movie | మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్లో సత్తా చాటిన భారతీయ చిత్రం
Homebound Movie | బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది.
Homebound Movie | బాలీవుడ్ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జేత్వా ప్రధాన పాత్రల్లో నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన ఈ చిత్రం తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం) సత్తా చాటింది. ఈ ఫెస్టివల్లో ఉత్తమ చిత్రంతో పాటు ఉత్తమ దర్శకుడిగా నీరజ్ ఘైవాన్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు ఇదే వేడుకలో బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్ ‘ఎక్స్‌లెన్స్ ఇన్ సినిమా’ అవార్డును అందుకున్నారు. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించాడు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ (Martin Scorsese) ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించడం విశేషం.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. చందన్ కుమార్ (విశాల్ జేత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖత్తర్) అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జీవితాల కథ ఆధారంగా వచ్చింది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వీరిద్దరూ మంచి జీవితం కోసం ఆరాటపడుతుంటారు. వారికి సమాజంలో ఎదురయ్యే వివక్ష, పేదరికం నుండి బయటపడటానికి, దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు. పోలీసు విభాగంలో 2.5 మిలియన్ల మంది దరఖాస్తుదారులలో కేవలం 3,500 మంది మాత్రమే ఎంపికయ్యే అవకాశం ఉన్నప్పటికీ, యూనిఫాం ధరించి, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని కలలు కంటారు.
వారిద్దరి మత, సామాజిక నేపథ్యాలు వేరైనా, వారి స్నేహం చాలా బలమైనది. ఆచరణాత్మక ఆలోచనలు కలిగిన చందన్, కోపంగా ఉండే మహ్మద్‌ను ఇబ్బందుల నుండి కాపాడుతుంటాడు. అయితే, వారి స్నేహం ఒక పరీక్షకు గురవుతుంది. చందన్ పరీక్షలో ఉత్తీర్ణుడైతే, మహ్మద్ విఫలమవుతాడు. చందన్ తన ఉద్యోగ నియామకం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుండగా, మహ్మద్ ఒక ఎలక్ట్రానిక్స్ డీలర్ వద్ద పనిలో చేరి, తన హిందూ సహోద్యోగుల గౌరవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తాడు.
2020లో కోవిడ్-19 విజృంభించి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయానికి, ఈ ఇద్దరు యువకుల జీవితాలు విడిపోయి, మళ్లీ కలుసుకుంటాయి. ఈ ప్రయాణంలో, వారి స్నేహం, ఆశలు, నిరాశలు, సామాజిక అసమానతలు, వ్యక్తిగత పోరాటాలు వంటి అనేక అంశాలను దర్శకుడు నీరజ్ ఘైవాన్ తెరపై చూపించాడు. అట్టడుగు వర్గాల ప్రజలు గౌరవంగా, ఆనందంగా జీవించడానికి పడే కష్టాలను ఈ చిత్రం ఎంతో సున్నితంగా, వాస్తవికంగా చిత్రీకరించింది. జాన్వీ కపూర్ పోషించిన సుధా భారతి పాత్ర కూడా కథలో కీలకమైనది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

