Mohanlal | మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా వృషభ (VRUSHABHA). నందకిశోర్ దర్శకత్వంలో తెలుగు, మలయాళ బైలింగ్యువల్ చిత్రంగా వస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ యాక్టర్ రోషన్ మేక కీ రోల్ పోషిస్తున్నాడు. ఇటీవలే గ్రాండ్‌గా లాంఛ్ కాగా.. ముహూర్తపు సన్నివేశానికి ఊహ (Ooha) క్లాప్ కొట్టింది. ఈ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భారీ క్రేజీ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ అందించారు మేకర్స్.
Moonlight, Three Billboards Outside Ebbing, Missouri సినిమాలు అందించిన ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ నిర్మాత నిక్ థర్లో (Nick Thurlow) మోహన్‌లాల్ టీంతో జాయిన్ అయ్యాడు. హాలీవుడ్ టచ్ ఇచ్చేలా సినిమా ఉండబోతున్నట్టు మోడల్ సెట్ వీడియోతో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. నిక్ థర్లోతో వృషభ టీం సెట్ గురించి చర్చిస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోతో సినిమా హైటెక్నికల్ వాల్యూస్‌తో గ్రాండ్‌గా ఉండనున్నట్టు క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో శనయ కపూర్, ఝరా ఎస్ ఖాన్, రాగిణి ద్వివేది, సిమ్రన్, గరుడ రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వృషభ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని బాలాజీ టెలీఫిలిమ్స్, కనెక్ట్ మీడియా, ఏవీస్ స్టూడియోస్ బ్యానర్లపై ఏక్తాకపూర్, వరుణ్ మథుర్, అభిషేక్ వ్యాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వృషభ మలయాళం, తెలుగుతోపాటు కన్నడ, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ చిత్రం 2024లో విడుదల కానుందని ఇప్పటికే మేకర్స్ తెలియజేశారు మేకర్స్.
మోహన్ లాల్ దీంతోపాటు పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో మలైకోటై వాలిబన్ (Malaikottai Valiban) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్, రాధికా ఆప్టే, సోనాలీ కులకర్ణి, డానిష్ సేత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాక్స్ ల్యాబ్స్-సెంచురీ ఫిలిమ్స్ బ్యానర్లపై జాన్-మేరీ క్రియేటివ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ లాల్ Ram: Part 1తోపాటు మరో రెండు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
ప్లాన్ విజువలైజేషన్ ఇలా..
Academy Award-winning film ‘Moonlight’s Executive Producer #NickThurlow joins forces with #VRUSHABHA
Releasing in more than 4500 screens worldwide in Malayalam, Telugu, Kannada, Tamil and Hindi in 2024.
@Mohanlal #RoshanMeka @shanayakapoor @TheZaraKhan @raginidwivedi24 pic.twitter.com/Qt0VuRWeFh
— 123telugu (@123telugu) August 7, 2023
Vrushabha takes its first step towards the frame! As the clapboard snaps shut for #Vrushabha, we ask for your love and blessings. pic.twitter.com/RM1uIkeJp2
— Mohanlal (@Mohanlal) July 23, 2023
It’s official!
Balaji Telefilms partners with Connekkt Media and AVS Studios for #VRUSHABHA – a Pan India bilingual Telugu Malayalam Film starring megastar Mohanlal.
High on emotions and VFX, the film is an Epic Action Entertainer transcending generations.
Touted to be one of… pic.twitter.com/cbW9Ygglhi— Sreedhar Pillai (@sri50) July 3, 2023