Vishwak Sen | నా మూవీ గురించి కూడా నలుగురు పెద్ద మనుషులు మాట్లాడాలి: విశ్వక్సేన్
Gaami Movie | టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం గామి. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్లో పాల్గోన్న విశ్వక్ సేన్ టాలీవుడ్ పెద్దలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Gaami Movie | టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం ‘గామి’. సోషియో ఫాంటసీగా వచ్చిన ఈ చిత్రం మార్చి 08న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్లో పాల్గోన్న విశ్వక్ సేన్ టాలీవుడ్ పెద్దలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్గా మలయాళం నుంచి ‘ప్రేమలు’ అనే సినిమా తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. అయితే ‘ప్రేమలు’, ‘గామి’ సినిమాలు ఒకే టైంలో విడుదలయ్యాయి. ఇక ప్రేమలు చూసిన సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. అయితే గామి సినిమాపై ఏ సెలబ్రిటీ స్పందించడం లేదు.. మరోవైపు నెటిజన్లు కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ స్ప్రెడ్ చేయడంతో మూవీ కలెక్షన్స్ తగ్గుతున్నట్లు తెలుస్తుంది.
ఇక తాజాగా గామి మూవీ ప్రెస్ మీట్లో పాల్గోన్న విశ్వక్ సేన్ మూవీపై మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘చాలా రిస్క్ చేసి ‘గామి’ సినిమా తీశాం. ఇది కమర్షియల్‌గా హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మేం ఆరేండ్లు కష్టపడి తీసిన సినిమా ఇది. మా సినిమాను కూడా నలుగురు పెద్ద మనుషులు చూసి.. మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. ఇలాంటి చిత్రం ఇప్పటి వరకు రాలేదని గర్వంగా చెబుతాను. మరో 20 ఏళ్ల తర్వాత తెలుగులో ఇలాంటి సినిమా వచ్చిందని గర్వంగా చెప్పొచ్చు. అంటూ విశ్వక్ వెల్లడించాడు. కాగా విశ్వక్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

