ఇందిరాదేవి మరణం బాధాకరం: హీరో బాలకృష్ణ
Indira Devi | హీరో మహేశ్ బాబు మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతిపట్ల సీనియర్హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆమె మరణం బాధాకరమని అన్నారు. ఇందిరాదేవి
హైదరాబాద్: హీరో మహేశ్ బాబు మాతృమూర్తి, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరాదేవి మృతిపట్ల సీనియర్హీరో బాలకృష్ణ సంతాపం తెలిపారు. ఆమె మరణం బాధాకరమని అన్నారు. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారని. కృష్ణ, మహేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇందిరాదేవి తుదిశ్వాస విడిచారనే విషయం విచారం కలిగించిందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని చెప్పారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అంతిమ సంస్కారాలను హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ఇవాళ మధ్యాహ్నం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు అభిమానుల సందర్శనార్ధం ఆమె భౌతికకాయాన్ని పద్మావతి స్టూడియోలో ఉంచనున్నారు.
కాగా, ఇందిరాదేవి భౌతికకాయానికి ప్రముఖ నిర్మాత అశ్వినీదత్, దర్శకులు కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామకృష్ణ, హీరో వెంకటేశ్, జీవిత, రాజశేఖర్, బండ్ల గణేశ్ నివాళులర్పించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

