Harshaali Malhotra | బాలయ్య కూతురిగా నటించిన హర్షాలి.. ఈమె ఎవరో మీకు గుర్తుందా?
Harshaali Malhotra | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే.
Harshaali Malhotra | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘అఖండ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టించిన విషయం తెలిసిందే.గత రాత్రి చిత్రంకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా వేడుకలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. అయితే అందరి దృష్టిని హర్షాలీ ఆకర్షించింది. అఖండ సినిమాలో ఒక బాలయ్య పాత్రకు కూతురు ఉన్నట్టు చూపించగా, ఇప్పుడు అఖండ 2లో ఆమె పెద్దయిన తర్వాత కథ జరగనుండటంతో ఆ పాత్రకు బాలీవుడ్ నటి హర్షాలీ మల్హోత్రాని తీసుకున్నారు.
భజరంగి భాయ్ జాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు అఖండ 2తో పదేళ్ల తర్వాత ప్రేక్షకులని పలకరిస్తుంది. అఖండ 2 తాండవం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హర్షాలీ ఇలా నీలి గాగ్రా చోళీ డ్రెస్ లో మెరిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘భజరంగీ బాయిజాన్’ చిత్రంలో మున్నీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హర్షాలీ మల్హోత్రా ‘అఖండ 2’లో కీలకమైన జనని పాత్రలో నటించి అలరించబోతుంది. హర్షాలీ ముంబయిలో సీరియల్స్‌లో నటిస్తూ కెరీర్ ప్రారంభించి, ‘భజరంగీ బాయిజాన్’లో బధిర బాలిక పాత్రతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన విషయం అందరికీ తెలిసిందే.
ఆమె అద్భుత నటనకు మహారాష్ట్ర ప్రభుత్వం అవార్డు కూడా అందించింది. ఇప్పుడు ఇదే ప్రతిభను ‘అఖండ 2’ ద్వారా టాలీవుడ్లో ప్రదర్శించబోతోంది. బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో ఈ సీక్వెల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ‘అఖండ 2: తాండవం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ హీరోయిన్గా, ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించనున్నారు. థమన్ సమకూరుస్తున్న సంగీతం ఇప్పటికే భారీ అంచనాలు పెంచగా, రామ్ అంచట–గోపీ అచంటలు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

