Sundaram Master | టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హోం ప్రొడక్షన్ హౌజ్ రవితేజ టీమ్ వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్లపై రవితేజ, సుధీర్‌కుమార్ కుర్రు సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం సుందరం మాస్టర్ (Sundaram Master). కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పాపులర్ కమెడియన్ హర్షచెముడు (Harsha chemudu) లీడ్ రోల్లో నటించాడు. ఫిబ్రవరి 23న విడుదలైన ఈ మూవీకి థియేటర్లలో మంచి స్పందన వచ్చింది. ఇక సుందరం మాస్టర్ చిత్రానికి థియేటర్లలో చూడటం మిస్సయిన వారి కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రం డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు రెడీ అయింది. తాజా న్యూస్ ప్రకారం సుందరం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో మార్చి 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందనేది చూడాలంటున్నారు నెటిజన్లు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్లో హర్షచెముడు సార్ గెటప్‌లో కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. బ్యాచ్ 2023 అంటూ గిరిజన మహిళలు, పురుషులు, చిన్నారులతో కలిసి హర్ష దిగిన గ్రూప్ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించాడు.
ఆదివాసీలకు ఏబీసీడీలు నేర్పించడానికి వచ్చిన హర్ష చెముడు (సుందరం మాస్టర్)కు ఆదివాసులంతా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. షాకవుతుంటాడు హర్ష. టైటిల్ క్యాప్షన్‌లో 1930ని కొట్టేస్తూ.. 2023లో ఆదివాసీలు ఎలా ఉన్నారనే ఫన్ యాంగిల్‌ను ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటుంది. ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో దివ్య శ్రీపాద ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో హర్షవర్ధన్, బాలకృష్ణ నీలకంఠపు, భద్రం ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటించారు
🎓Master home tuitions chepaniki mana intiki ochestunaduuu….ready ga undandi
‘CLASS’IC BLOCKBUSTER #SundaramMasterOnAha from March 28. 🌟@RaviTeja_offl @harshachemudu @SudheerKurru @kalyansanthosh8 @SricharanPakala @itswetha14 @RTTeamWorks @GOALDENMEDIA pic.twitter.com/2Sq1JI8tsl
— ahavideoin (@ahavideoIN) March 24, 2024
సుందరం మాస్టర్ ఫస్ట్ లుక్..
Immensely pleased to announce our next in @RTTeamWorks 🤗
Here is the FUST LUK of #SM alias #SundaramMaster
Our boy @harshachemudu made it INTERNET to INTERNATIONAL @SudheerKurru @kalyansanthosh8 @itswetha14@NambuShalini @SricharanPakala @GOALDENMEDIA pic.twitter.com/zkuS4ZIRo0
— Ravi Teja (@RaviTeja_offl) June 22, 2023
సుందరం మాస్టర్ టీజర్..