Kollagottanadhiro | ‘హరిహర వీరమల్లు’ నుంచి కొల్లగొట్టినాదిరో ప్రోమో రిలీజ్
Hari Hara Veera Mallu | పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) ప్రాజెక్ట్ నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో ప్రోమో విడుదల చేశారు మేకర్స్.
Pawan Kalyan | నటుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్డేట్ను పంచుకుంది.
ఈ సినిమా నుంచి కొల్లగొట్టినాదిరో(Kollagottanadhiro) అనే రెండో సింగిల్ ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కోర కోర మీసాలతో కోదమ కోదమ అడుగులతో.. జర జర వచ్చినాడు చిచ్చర పిడుగంటివాడు అంటూ విడుదల చేసిన ప్రోమో గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలో చాలా రోజుల తర్వాత ఒక సూపర్ హిట్ సాంగ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పాటలో నిధి ఆగర్వాల్‌తో పాటు అనసుయ కూడా తళుక్కున మెరిసింది.
జ్యోతి కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

