హన్సిక కథానాయికగా నటించిన యాభయ్యవ చిత్రం ‘మహా’. జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు కీలక పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను కథానాయకుడు శివకార్తికేయన్ విడుదలచేశారు. ఈ టీజర్లో హన్సిక భిన్న పార్శాలున్న పాత్రలో కనిపిస్తోంది. చిన్నారికి తల్లిగా, డబ్బు కోసం పిల్లలను కిడ్నాప్ చేసే యువతిగా రెండు విభిన్న గెటప్‌లలో కనిపించింది. మాజీ ప్రియుడు శింబుతో హన్సిక రొమాంటిక్ సీన్స్ టీజర్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కెరీర్లో తొలిసారి హన్సిక ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసినట్లు సమాచారం. దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న హన్సిక ఈ చిత్రం తనకు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఉంది. షూటింగ్లో అవాంతరాలు, లాక్డౌన్ వంటి సమస్యల కారణంగా చాలా కాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. పారితోషికం విషయంలో నెలకొన్న అభిప్రాయభేదాల కారణంగా నిర్మాతల ప్రయత్నాల్ని దర్శకుడు జమీన్ కోర్టు ద్వారా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది.