Dum Masala Song | ‘ధమ్ మసాలా బిర్యానీ’.. ఎర్ర కారం, అర కోడి.. ‘గుంటూరు కారం’ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
Guntur Kaaram Movie | సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం' (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Guntur Kaaram Movie | సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం'(Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదలవుతున్న భారీ అంచనాలున్న సినిమాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. మహేశ్ – త్రివిక్రమ్ శైలి మాస్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో మేకర్స్ వేగం పెంచారు. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ చేశారు.
ఎప్పుడెప్పుడా అంటూ మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్‌ను వచ్చే మంగళవారం (నవంబర్ 07) రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అయితే అంతకంటే ముందే ఫ్యాన్స్‌ను ఖుషి చేయడం కోసం మరో అప్డేట్ ఇచ్చారు. తాజాగా ఈ ఫస్ట్ సింగిల్ ‘ధమ్ మసాలా’ (Dum Masala)కు సంబంధించి ప్రోమో విడుదల చేశారు.
“ఎదురొచ్చే గాలి… ఎగరేస్తున్నా చొక్కా పై గుండీ… ఎగబడి ముందరకే వెళ్ళిపోతాది నేనెక్కిన బండి. ధమ్ మసాలా బిర్యానీ.. ఎర్ర కారం… అర కోడి, నీంబు సోడా… ఫుల్ బీడీ, గుద్ది పారేయి గుంటూరునే” అంటూ సాగిన లిరిక్స్ రిపీట్ మోడ్ లో వినేలా చేస్తున్నాయి. మరి ఈ సాంగ్ ఫుల్ వెర్షన్ వచ్చాక ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.
The highly Inflammable Superstar 🌟 @urstrulyMahesh is here to IGNITE the screens with a MASS BLAST! 💥🔥#GunturKaaaram First single #DumMasala Promo Out Now – https://t.co/KF1FE19RNE
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 #SanjithHegdeFull Song out on Nov 7th! 🌶…
— Haarika & Hassine Creations (@haarikahassine) November 5, 2023
అతడు, ఖలేజా సినిమాలో క్యారెక్టర్లకు మాస్ తోడైతే ఏ రేంజ్లో ఉంటుందో మహేష్ రోల్ ఆ రేంజ్లో ఉంటుందట. ఇక ఆ మధ్య విడుదలైన గ్లింప్స్‌కు వీర లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా శ్రీలీల, మీనాక్షీ చౌదరీలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధా కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

